భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని కోసం 'భారత్‌పోల్' అనే పోర్టల్‌ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు.
Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్‌లకు మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు.
Sandip Ghosh: పశ్చిమ బెంగాల్ లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు.
CBI, drugs, shipping container, Visakhapatnam Port, Andhra Pradesh, Central Bureau of Investigation, Operation Garuda, International Drug Operation, Brazil, Narcotics,
Bribery Case: ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని సహా ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తులు టెండర్ కోసం లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెండర్ ఒడిశాలోని ఓ పాఠశాలకు సంబంధించి రూ.19.96 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ భట్నాగర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో స్పెషల్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం వాప్కోస్(WAPCOS) మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజిందర్ కుమార్ గుప్తా, అతని కుమారుడు గౌరవ్‌ను అరెస్టు చేసింది.
అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి సమన్లు అందిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్కే పురంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. బస్సులో ఉన్న నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ సోదాలు నిర్వహించింది. భారత విదేశీ నిధుల నిబంధనల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆక్స్‌ఫామ్ ఇండియా, దాని ఆఫీస్ బేరర్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.