ఒక సమూహం లేదా ఓటర్‌ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.
అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది.
Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు గ్రామంలో వైరల్ అవుతున్నాయి. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి…
అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది." అని సమాధానం ఇచ్చారు.
Indian MBBS Student: ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్‌గా అక్కడి అధికారులు గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో అర్షిద్ నడిపిన బైకు వేగంగా రావడంతో అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. Read Also: Bengaluru Stampede: తొక్కిసలాట బాధితులలో చాలామంది డిశ్చార్జ్.. 14 ఏళ్ల బాలుడు ఇంకా…
Gun Firing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి దుకాణంపై గన్‌ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన గ్వాలియర్ మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనారాయణ్ బజార్ లో మే 16వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలోని ప్రధాన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి, సంఘటన స్థలంలో సీన్ రీక్రియేట్ చేశారు. Read Also: Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న…
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్ ఒక మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 9:30 గంటల సమయంలో మహిళతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకుని అనంతరం గదిలోకి తీసుకెళ్లిన దృశ్యాలు పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో…