ఓ మూడేళ్ల పిల్లాడు ఏకంగా 18వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందికి పడిపోయాడు. అయినా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కుటుంబీకుల్లో సంతోషం వెల్లువిరిసింది. ఇంతకీ ఆ బాలుడి ప్రాణాలు ఎవరు కాపాడారో తెలుసా? మనుషులు కాదు.. ఓ వృక్షం. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. జూలై 15న ఆగ్నేయ చైనా దేశం జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో ఈ ఘటన జరిగింది. ఓ మూడేళ్ల బాలుడు ఇంట్లో నిద్రపోయాడు. ఆ బాలుడిని ఇంట్లోనే వదిలేసి కుటుంబీకులు షాపింగ్‌కి వెళ్లారు. ఫ్లాట్ తలుపును మూసివేశారు. వాళ్లు షాపింగ్ నుంచి తిరిగి ఇంటికి రాగానే ఇంట్లో మొత్తం వెతికినా బాలుడు కనిపించలేదు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ బిల్డింగ్ కింద ఓ బాలుడు పడి ఉండటాన్ని గమనించాడు. వీడియో తీసి ఆ భవనం నిర్వహన కమిటీకి పంపాడు. కుటుంబీకులకు సమాచారం అందడంతో వాళ్లు అక్కడికి చేరుకుని బాలుడిని ఫ్లాట్‌కు తీసుకెళ్లారు.
READ MORE: National Film Awards 2025: జై బాలయ్య.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’!
ఆసుప్రతికి తరలించగా.. వైద్య సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ బాలుడికి ఎడమ చేయి, వెన్నుముఖ తదితర గాయాలు అయినట్లు గుర్తించారు. తలకు మాత్రం ఎలాంటి గాయం కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తన కొడుకు ప్రాణాలను కాపాడినందుకు గౌరవంగా చెట్టును పెద్ద ఎర్రటి పువ్వుతో అలంకరించాడు ఆ తండ్రి. బాలుడి తండ్రి, పేరు ఝు. ఇంట్లో పడుకున్న చిచ్చర పిగుడు బయటకు ఎలా వెళ్లాడు అని ఝు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. జరిగింది చూసి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. 18వ అంతస్తు నుంచి కిందికి పడిపోయినట్లు కనిపించింది కింద ఉన్న చెట్టు కొమ్మలలో ఇరుక్కుపోయి నెమ్మదిగా నేలపై పడిపోయాడు. కొంత సమయం తర్వాత, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి బాలుడు నేలపై పడి ఉండటాన్ని గమనించి వీడియో తీయడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.