IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- మహిళలు, ఉజ్వలనే మోడీని గెలిపించాయి.
- ఎల్పీజీ పథకంపై అంతర్జాతీయ సంస్థ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IEA: ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు లభించాయి. గ్రామీణ భారతదేశం మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పథకాన్ని అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సబ్సిడీతో ఎల్పీజీని అందించడంలో ఉజ్వల పథకం సహాయపడిందని, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిందని బిరోల్ పేర్కొన్నారు.
ఉజ్వల పథకం, మహిళల ఓట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల విజయాలకు కీలకంగా మారాయని చెప్పారు. 2016 మేలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా పేద, గ్రామీణ కుటుంబాలను కట్టెలు, బొగ్గు వంటి సంప్రదాయ వంట ఇంధనాల నుంచి ఎల్పీజీకి మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ద్వారా వచ్చే పొగ మహిళల ఆరోగ్యం, వంట చేసే సమయంపై చాలా ప్రభావం చూపుతుందని, వీటి నుంచి వారిని రక్షించేందుకు ఎన్డీయే సర్కార్ ఉజ్వల పథకాన్ని తీసుకువచ్చింది.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో 2016 మే 1న ప్రధాని మోదీ ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. 2020 మార్చి నాటికి పేద కుటుంబాలకు 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందించాలన్నది ప్రారంభ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్ణీత గడువుకు ముందే సాధించారు. 2019 సెప్టెంబర్ 7న మహారాష్ట్ర ఔరంగబాద్ లో మోడీ 8 కోట్లవ ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్ అందచేశారు. 2025 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్లకు పైగా కనెక్షన్ల మైలురాయికి చేరుకుంది. ఉజ్వల లబ్ధిదారులకు ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీని కొనసాగిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు రూ. 12000 కోట్ల సబ్సిడీ కేటాయింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన వినియోగదారులకు ఒక్కో సిలిండర్పై రూ. 300 సబ్సిడీ లభిస్తోంది.
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!