అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు చంద్రపూర్ జిల్లాకు చెందిన ఆశిష్ రెడిమల్లా అని వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడానికి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చేవాడు. సాయంత్రం ఇళ్లను తనిఖీ చేసి రాత్రుల్లో దొంగతనం చేసేవాడు. మళ్లీ తిరిగి ఉదయం మొదటి బస్సులో చంద్రపూర్‌కు తిరిగి వెళ్లేవాడు.
READ MORE: Konda Murali: సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..
నిందితుడు ఆశిష్ ఎం.టెక్ వరకు చదివాడని దర్యాప్తులో తేలింది. అతను నాగ్‌పూర్, పూణేలోని ఐటీ కంపెనీలలో కూడా పనిచేశాడు. కానీ, చెడు స్నేహితులను ఎంచుకున్నాడు. జూదానికి బానిసయ్యాడు. జూదంలో రూ.23 లక్షలు పోగొట్టుకున్నాడు. మొత్తం అప్పు తీర్చడానికి.. దొంగతనం ఓ సులభమైన మార్గంగా భావించాడు. నగరంలోని పెద్ద బంగ్లాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
READ MORE: Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!
ఈ అంశంపై ధంతోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనామిక మీర్జాపురే మాట్లాడుతూ.. “ఆశిష్ నాగ్‌పూర్‌లో పనిచేస్తున్నప్పుడు ఛత్రపతి నగర్ ప్రాంతంలో నివసించేవాడు. కాబట్టి అక్కడి ఇళ్ల గురించి అతనికి ముందే తెలుసు. అదే ప్రాంతంలోని విలాసవంతమైన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. చంద్రపూర్ నుంచి ఆశిష్ బస్సులో నాగ్‌పూర్‌కు వచ్చి ఖాళీ ఇళ్లను తనిఖీ చేసేవాడు. ఇప్పటివరకు 5 చోట్ల దొంగతనాలు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్నాడు.” అని పేర్కొన్నారు.