ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్‌లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్‌మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: AIADMK: విజయ్ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. పొత్తుపై అన్నాడీఎంకే..
ఈ సంఘటన రాత్రి సమయంలో జరిగిందని చెబుతున్నారు. రవీంద్ర షోరూమ్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు. అతడు గేట్‌ను మూసేయడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా షోరూమ్ ప్రధాన గేటు కూలిపోయింది. రవీంద్ర గేటు కిందికి పడిపోయారు. గేటు కింద తీవ్ర నొప్పితో కొట్టుమిట్టాడుతూ.. ఆయన తుది శ్వాస విడిచారు. రాత్రి సమయం కావడంతో వాచ్‌మెన్‌కు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. అతను గేటు కింది నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆలేక పోయాడు. ఆ గేట్‌కు చాలా కాలంగా మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు.
READ MORE: Minister Narayana: అమరావతిలో అదనపు ల్యాండ్ పూలింగ్.. ఆ 7 గ్రామాలు అంగీకరించాయి
ఉదయం 7 గంటల ప్రాంతంలో స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి రవీంద్ర గేటు కింద పడి మరణించిన విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కట్‌ఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ సంఘటన అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షోరూమ్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. గేటు పడిపోయే స్థితికి చేరుకున్నా.. రిపేర్ చేయించలేదుని చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సిటీ రణ్ విజయ్ సింగ్ తెలిపారు.
#मुरादाबाद: गेट के नीचे दबा सिक्योरिटी गार्ड हुई मौत, वीडियो वायर
बाइक शोरूम में सिक्योरिटी गार्ड था रविन्द्र। थाना कटघर क्षेत्र का है मामला#Moradabad #SecurityGuardDeath #CCTVFootage @moradabadpolice pic.twitter.com/IbETvQGyzE— Bittu Pandit Reporter (@BittuPa76040164) July 4, 2025