Delivery Agent Urinates: లిఫ్ట్‌లో మూత్రవిసర్జన చేసిన డెలివరీ ఏజెంట్.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. చివరకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Agent Urinates: ముంబైలోని విరార్ వెస్ట్‌లో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఇ-కామర్స్ డెలివరీ సంస్థ బ్లింకిట్ కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ బిల్డింగ్ లోని లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఏదో భరించలేని వాసన రావడంతో.. అక్కడి నివాసితులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బ్లింకిట్ జాకెట్ ధరించిన వ్యక్తి ఓ పార్సిల్ పట్టుకుని లిఫ్ట్‌లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ తర్వాత అతను తన ప్యాంట్ జిప్ తీసి, వెనక భాగాన ఉన్న కెమెరాకు కనిపించకుండా ఉండేందుకు ఓ మూలకు వెళ్లి, లిఫ్ట్ వాకిళ్లపై మూత్రవిసర్జన చేశాడు.
Today Astrology: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే!
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ఈ వీడియోను చూసిన తర్వాత బిల్డింగ్ నివాసితులు బ్లింకిట్ ఆఫీసుకు వెళ్లి ఆ డెలివరీ బాయ్‌ను గుర్తించారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై రెసిడెంట్స్ దాడి చేసినట్లు సమాచారం. అంతేకాదండోయ్.. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ ను విరార్ వెస్ట్ లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి అసభ్య ప్రవర్తనతో కంపెనీల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం తగ్గుతోందని పలువురు విమర్శిస్తున్నారు. డెలివరీ సంస్థలు తమ సిబ్బందిపై పర్యవేక్షణను మరింత కఠినంగా మార్చాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై బ్లింకిట్ సంస్థ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!