Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- అనుమానితులపై పోలీసుల నిఘా
- ఫేషియల్ రికగ్నిషన్‌తో పాత నేరస్థుల గుర్తింపు
- మఫ్టీ పోలీసులతో పటిష్ట భద్రత
- బోనాల్లో చోరీలకు పూర్తిగా చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Darwaza Bonalu: పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ చేపట్టిన ముందస్తు నిఘా చర్యలు విశేష ఫలితాలను ఇచ్చాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) యం. శ్రీనివాస్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆస్తి సంబంధిత నేరాలను నివారించేందుకు స్పెషల్ క్రైమ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్‌తో నేరస్థుల గుర్తింపు.. 8 మంది పాత నేరస్థులు సీజ్!
లాల్‌దర్వాజ ఉత్సవ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారుల వద్ద అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ వద్ద ఉన్న నేరస్థుల డేటాబేస్‌తో అనుమానితుల వివరాలను సరిపోల్చగా, అదుపులోకి తీసుకున్న 116 మందిలో 8 మంది పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యింది. చైన్ స్నాచింగ్‌లు, జేబుదొంగతనాలకు అలవాటుపడిన ఈ పాత నేరస్థులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read
మఫ్టీ పోలీసుల నిఘా.. ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదు
ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక పహాడాతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. సీసీఎస్ స్పెషల్ టీమ్స్ , స్థానిక పోలీసులు సమన్వయంతో చేపట్టిన ఈ పటిష్ట బందోబస్తు కారణంగా లాల్‌దర్వాజ బోనాల్లో ఒక్క సెల్‌ఫోన్ చోరీ గానీ, చైన్ స్నాచింగ్ లేదా దొంగతనం ఘటన గానీ నమోదు కాలేదని అడిషనల్ సీపీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!