UP: పెళ్లయిన 50 రోజులకే ప్రియుడితో జంప్.. లస్సీలో మత్తు మందు కలిపి..
- హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఘటన
- వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన
- లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిన నూతన వివాహిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.
READ MORE: Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..
Also Read
అసలు ఏం జరిగిందటే..?
సారావా గ్రామంలో నివసించే సల్మాన్ వడ్రంగి పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న లోనీ నివాసి అయిన సనా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మే 13 రాత్రి సనా కుటుంబీకులకు లస్సీని అందించింది. లస్సీ తాగిన తర్వాత అందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 7:00 గంటల ప్రాంతంలో.. పొరుగువారు తలుపు తెరిచి వారిని నిద్రలేపారు. సల్మాన్ భార్య కనిపించడం లేదని, ఇంట్లో ఉన్న రూ.44,500 నగదు, లక్షల విలువైన నగలు కూడా పోయాయని వారు గుర్తించారు.
READ MORE: Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేనట్లే..!
ఆ కుటుంబం ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసింది. అందులో సనా రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఓ యువకుడితో బైక్ పై వెళ్తున్నట్లు కనిపించింది. దీని ఆధారంగా.. సనా లస్సీలో మత్తు పదార్థాలు కలిపి తాగించి, ఆపై తన ప్రేమికుడితో పారిపోయిందని కుటుంబ సభ్యులు అనుమానించారు. వివాహిత కుటుంబాన్ని సంప్రదించినప్పటికీ.. సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ కుటుంబం హాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హాపూర్ కొత్వాలిలో కేసు నమోదు చేసి, సనాను పట్టుకున్నారు. ఆమె భర్తతో వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో పోలీసులు సనాను ఆమె బంధువులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!