గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు…
బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ద్విచక్రవాహన దారుడు అదుపుతప్పి కింద పడ్డ పడ్డాడు. ఆ వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అని రోడ్డుపై ఇతర వాహన దారులు ధర్నాకు దిగారు. దీంతో బాల నగర్ నుంచి నర్సాపూర్…
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్‌లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది.
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్‌పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు.…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.
హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్లో పేర్కొన్నారు..
ముంబై నుంచి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మరోల్ ప్రాంతంలో ఒక పిచ్చి ప్రేమికుడు తన మైనర్ ప్రియురాలిని కోపంతో సజీవ దహనం చేయాలని చూశాడు. తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.