జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం..…
ఓ మూడేళ్ల పిల్లాడు ఏకంగా 18వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందికి పడిపోయాడు. అయినా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కుటుంబీకుల్లో సంతోషం వెల్లువిరిసింది. ఇంతకీ ఆ బాలుడి ప్రాణాలు ఎవరు కాపాడారో తెలుసా? మనుషులు కాదు.. ఓ వృక్షం. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
Delivery Agent Urinates: ముంబైలోని విరార్ వెస్ట్‌లో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఇ-కామర్స్ డెలివరీ సంస్థ బ్లింకిట్ కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ బిల్డింగ్ లోని లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఏదో భరించలేని వాసన రావడంతో.. అక్కడి నివాసితులు…
ATM Robbery: హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. జూలై 8 రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. Read Also:HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్‌లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్‌మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పూణే కోంధ్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్‌గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. Read Also:Singam…
ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.