సీబీఐ కొత్త చీఫ్ కీలక ఆదేశాలు.. అధికారులు, సిబ్బందికి డ్రెస్ కోడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త బాస్ వచ్చినప్పుడు.. తాను ఏంటో చూపించుకోవాలని అనుకుంటారు.. తన మార్క్ కనిపించాలని అనుకుంటారు.. అది పని విధానమే కావొచ్చు.. డ్రెస్ కోడే కావొచ్చు.. మరోలా కనిపించొచ్చు.. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) ఈ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. సీబీఐ కొత్త డైరెక్టర్ ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించారు సుబోధ్ కుమార్ జైస్వాల్… తాజాగా, సీబీఐలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని, హుందాగా కనిపించే ఫార్మల్ డ్రెస్సులే ధరించాలని ఆదేశించారు.. సీబీఐ కొత్త చీఫ్ ఆదేశాల ప్రకారం.. సీబీఐలో పని చేసే పురుషులు షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాల్సి ఉంటుంది.. ప్రతి రోజూ నీట్‌గా షేవ్ కూడా చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.. ఇక, మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో.. విధుల్లో ఉన్నప్పుడు జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వేర్ ఏదీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు కొత్త బాస్. ఇది కేవలం.. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల హెడ్స్ కూడా ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది.. అంటే.. దేశవ్యాప్తంగా సీబీఐలోని ఉద్యోగులు, సిబ్బందికి ఈ డ్రెస్ కోడ్ వర్తించనుంది… కాగా, సీబీఐలో డ్రెస్ కోడ్ ఎప్పటి నుంచో ఉందంట.. కానీ, క్రమంగా ఇతర దుస్తులను ధరిస్తూ ఆ నిబంధనను తుంగలో తొక్కేశారు.. ఇప్పుడు కొత్త బాస్ తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో అంతా అలర్ట్ అవుతున్నారు. ఇది సీబీఐలో కీలక మార్పులకు నాందిగా మరికొందరు చెబుతున్నారు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్‌లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!