తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భరత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. కాగా, రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి (ఎస్‌హెచ్‌వో), సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ పాల్‌ను ప్రతివాదులుగా చేర్చిన సంగతి తెలిసిందే.