మంగళవారం రోజు .. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగున్నారు జైస్వాల్.. మహారాష్ట్ర క్యాడర్ 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు ప్యానల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ వైపు మొగ్గు చూపింది. ఇక, గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు జైస్వాల్.. ముంబై పోలీసు కమీషనర్‌గా సేవలు అందించారు.. తెల్గీ స్కామ్‌లో విచారణలో ఆయన కీలక పాత్ర పోషించారు.. మరోవైపు మహారా: రిజర్వ్ పోలీసు ఫోర్స్ చీఫ్‌గా కూడా పనిచేశారు.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌లోనూ విధులు నిర్వహించారు.. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రా వింగ్‌లోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం.