అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పశ్చిమబెంగాల్‌లో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.. మంత్రులను, టీఎంసీ నేతలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ.. టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై భగ్గుమన్న దీదీ.. ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు.. నన్ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారామె. మంత్రి ఫిర్హద్ హకీంతో పాటు సుబ్రతా ముఖర్జీని వెంటనే విడుదల చేయాలంటూ ఫైర్ అయ్యారు. కాగా, నారద కుంభకోణం కేసులో మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీని వీరితో పాటు మదన్ మిత్ర, సోవన్ ఛటర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హకీం… దీదీ కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ కుట్రపూరితంగా తమ నేతలను అరెస్ట్ చేయిస్తుందంటూ టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.