కడప జిల్లా : వైఎస్ వివేకా హత్య కేసులో ఇవాళ 19వ రోజు సీబీఐ విచారణ కొనసాగనుంది. విచారణలో భాగంగా నిన్న పులివెందులకు చెందిన బాలుతో పాటు పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించింది సీబీఐ బృందం. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్, కడప ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ కేంద్రాలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇక ఇవాళ మరికొంత కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు.
read more : మహిళలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు
ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు… ఇవాళ మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దొరికిన ప్రతి ఆధారాన్ని వదలకుండా.. సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కాగా…సీబీఐ విచారణ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు.. తమ కుటుంబానికి భద్రత పెంచాలని పోలీసులను కోరిన సంగతి తెలిసిందే.