వైయస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతుంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వరుసగా నాలుగో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఎర్ర గంగిరెడ్డితో పాటు రాఘవేంద్ర రెడ్డి, సింహాద్రిపురం నుంచి వ్యవసాయ కూలీ ఓబుల్ పతి నాయుడు, కదిరికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన దంపతులు కృష్ణా, సావిత్రి తో కలిపి నేడు మొత్తం ఆరు మంది సీబీఐ విచారణకు హాజరయ్యారు.