మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ 16 వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా నిన్న (సోమవారం) కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో వైఎస్ వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని ఏడుగంటల పాటు విచారించారు. అలాగే కడపకు చెందిన రవిశంకర్, పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు కిరణ్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్‌లను ప్రశ్నించి.. సమాచారం రాబట్టుకొన్నట్లు తెలుస్తోంది.