సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. అయితే ఇందూ టెక్ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసారు. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరగా.. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం కోరారు జగన్. డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు సమయం కోరారు విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ. అయితే జగన్, విజయసాయిరెడ్డి న్యాయవాది వినతితో జులై 1కి వాయిదా వేసింది కోర్టు. రఘురాం సిమెంట్స్ కేసులో వాదనలకు వి.డి.రాజగోపాల్ సమయం కోరారు విచారణను జులై 1కి వాయిదా వేసింది కోర్టు.