వైఎస్ వివేకా హత్య కేసులో 15వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఈ కేసులో ఆరుగురు అనుమానితులు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అటు వరుసగా 5వ రోజు సీబీఐ విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హాజరు కావడం విశేషం. ఎర్ర గంగిరెడ్డితో పాటు పులివెందులలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు కృష్ణయ్య, సావిత్రి, కుమారులు సునీల్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇవాళ సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు కడపకు చెందిన ఉపాధ్యాయుడు రవిశంకర్ కూడా హాజరు అయ్యారు. కాగా.. సీబీఐ విచారణ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు.. తమ కుటుంబానికి భద్రత పెంచాలని పోలీసులను కోరిన సంగతి తెలిసిందే.
read more : తమిళనాడులో దారుణం: కొడుకుకి దెయ్యం పట్టిందని ఆ తల్లి…