టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీబీఐపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ప్రతీ అంశంపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే సాయిరెడ్డి.. ఇవాళ చంద్రబాబు సీబీఐ కామెంట్స్ పై సెటైర్లు వేశారు.. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు..! అని మండిపడ్డ ఆయన.. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు (నారా) నాయుడు బాబు.. అందితే జుట్టు… అందకపోతే కాళ్లు.. ఈ అవకాశవాది దినచర్య అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Kishan Reddy : కేసీఆర్ భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారు
కాగా, ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటూంటే పోలీసులు కనీసం చర్యలు చేపట్టడం లేదంటూ చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే.. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. డీజీపీలు మారినా, వారి తీరు మాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలస్యం అయ్యేకొద్దీ కేసులో కీలకంగా ఉన్న నిందితులు తప్పించుకుంటారని, ఇప్పటికే సాక్షులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారని గుర్తు చేశారు. సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెను సవాల్ అని, కరడుగట్టిన నేరస్తులను సీబీఐ వంటి సంస్థలు ఎంతమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. త్వరలోనే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, ప్రజలకు నిజానిజాలు తెలపాలని కోరారు చంద్రబాబు నాయుడు.