YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది.. విచారణ కీలక దశకు చేరుకుంది.. అయితే, ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి.. పొలిటికల్ ఎంట్రీపై ఓ పోస్టర్ కలకలం రేపుతోంది.. కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా వేసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి.. వైఎస్ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రే పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ…
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది.. ఎన్నో మలుపు, మరెన్నో పరిణామాల తర్వాత సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టు పరిణామాలు చూస్తేనే తెలుస్తోంది.. అయితే.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఈ రోజు పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. దస్తగిరి భద్రతపై సమాచారాన్ని సేకరించారు.. భద్రతకు సంబంధించిన విషయాలను దస్తగిరిని…
ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో టీఎస్పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి సమన్లు అందిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్కే పురంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. బస్సులో ఉన్న నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతికి పాల్పడిందనే ఆరోపణల కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు పిలిచింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు.