YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది.. ఎన్నో మలుపు, మరెన్నో పరిణామాల తర్వాత సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టు పరిణామాలు చూస్తేనే తెలుస్తోంది.. అయితే.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఈ రోజు పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. దస్తగిరి భద్రతపై సమాచారాన్ని సేకరించారు.. భద్రతకు సంబంధించిన విషయాలను దస్తగిరిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలనే ఆదేశించిన సీబీఐ అధికారులు.. ఏ చిన్న అనుమానం వచ్చినా.. వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.. ఇప్పుడు అతడి భద్రతపై ఆరా తీసి.. అప్రమత్తం చేసింది సీబీఐ.
Read Also: Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం