ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మనీష్ సిసోడియాకు సీబీఐ షార్ ఇచ్చింది. అందులో నిందితుడిగా మనీష్ సిసోడియాను చేర్చింది. ఛార్జ్ షీట్ లోకి మనీష్ సిసోడియా పేరు ఎక్కడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు గోరంట్ల బుచ్చిబాబు పేరును కూడా సీబీఐ తాజాగా ఛార్జ్ షీట్ లోకి చేర్చనుంది.
Also Read : Mahmood Ali : మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారు
ఇకపోతే ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ( ఏప్రిల్ 26న ) రేపు పిటిషన్ పై తీర్పును వెల్లడించనుంది. ఈ క్రమంలో సీబీఐ మనీష్ సిసోడియాపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో సిసోడియాకు బెయిల్ వచ్చే అవకాశాలు మరింత తగ్గనున్నాయి. దీంతో బుధవారం ఢిల్లీ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుంది.. సిసోడియాకు బెయిల్ వస్తుందా.. రాదా.. అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
Also Read : Viral Video: డ్యాన్సర్ తో చిందులేసి.. ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే
ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి గతేడాది నవంబర్ లో మొదటిసారీ ఛార్జ్ షీట్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) దాఖలు చేసింది. అందులో A-1 అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్ ను, A-2గా అప్పటి అబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేందర్ సింగ్, A-3గా విజయ్ నాయర్, A-4గా అభిషేక్ బోయినపల్లి పేర్లను చేర్చింది.