Ys Viveka Case: వైఎస్ వివేకా కేసు.. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివేకానంద రెడ్డి హత్య కేసు (Ys Viveka Case) కీలక మలుపులు తిరుగుతోంది. కాసేపటి క్రితం సుప్రీంకోర్టు (supereme court of india) కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై విచారణలో ఇవాళ కీలక ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు.దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Ys Viveka Case) కూతురు, సునీత రెడ్డి తరఫున న్యాయవాది సిద్దార్థ్ లోద్రా వాదనలు వినిపించనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేసే విచారణకు ఆటంకం కలిగించేలా ఉందనే అంశంపై వాదనలు వినిపించనున్నారు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్ద్ లోద్రా. గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ముందస్తు బెయులు ఇవ్వడం, ఇవ్వకపోవడం పై ఇచ్చిన తీర్పులకు భిన్నంగా, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం దృష్టికి సునీతా రెడ్డి తరఫు న్యాయవాది తీసుకురానున్నారు.
Read Also:Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అన్నదాతకు అపార నష్టాలు
Also Read
నిందితుల కుటుంబ సభ్యులు సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేయడం బెదిరింపులకు పాల్పడ్డారనే అంశాన్ని ధర్మాసనం దృష్టి కి తీసుకురానున్నారు సునీతా రెడ్డి తరఫు న్యాయవాది. పిటీషనర్ సునీతారెడ్డి, ఆమె భర్తే వివేకానంద రెడ్డి హత్యకు కారకులని ఆరోపణలు
చేయడం, వారినే విచారణ చేయాలని అవినాష్ కోరడం అభ్యంతరకరమని వాదనలు వినిపించనున్నారు సునీతా రెడ్డి న్యాయవాది. పైగా, తనను విచారణ చేయడాన్ని అవివాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, విచారణకు సహకరించకపోవడమేనని విచారణ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ధర్మాసనం దృష్టికి తేనున్న పిటిషనర్ న్యాయవాది.
Read Also: American Airlines: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. ఓహియోలో అత్యవసర ల్యాండింగ్
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!