Sanjay Bhandari-VijayMallya- Nirav Modi Extradition: భారత్‌లో నేరాలకు పాల్పడి విదేశాల్లో నివసిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో పాటు విజయ్ మాల్యాలను భారత్‌కు తీసుకురావడానికి భారత దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. త్వరగా వీరిని అప్పగించేందుకు సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏల బృందం బ్రిటన్‌కు బయలుదేరింది. బ్రిటన్ తో పాటు ఇతర దేశాలలో పరారీలో ఉన్న వారి ఆస్తులను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also: Klin Kaara: చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్..ఎంత బాగుందో కదా..
ఇక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి నేతృత్వంలోని ఉమ్మడి బృందానికి లండన్‌లోని భారత హైకమిషన్ ద్వారా యూకే అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. పారిపోయిన వారు సంపాదించిన ఆస్తులు, వారి బ్యాంకింగ్ లావాదేవీల గురించి సమాచారం పెండింగ్‌లో ఉంది. అయితే, ఆయుధ వ్యాపారి భండారీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడు. యూపీఏ హయాంలో జరిగిన అనేక రక్షణ ఒప్పందాలపై ఆదాయపు పన్ను శాఖతో పాటు ఈడీ విచారణ ప్రారంభించిన వెంటనే సంజయ్ భండారీ 2016లో భారత్ నుంచి పరార్ అయ్యాడు.
Read Also: Makkal Selvan: సేతుపతి ఉంటే సాలిడ్ కంటెంట్ ఉన్నట్లే…
అయితే, సంజయ్ భండారీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను భారత్ బహిష్కరించడంపై అక్కడి హైకోర్టుల్లో వారంతా అప్పీలు చేయడంతో బ్రిటన్‌లో వారి అప్పగింత పెండింగ్‌లో ఉంది. ఈడీ ఇప్పటికే భారతదేశంలోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే, విజయ్ మాల్యా, నీరవ్ మోడీల వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా డబ్బు కూడా రికవరీ చేయబడింది.. మిగతా బకాయిలను కూడా త్వరలోనే రాబడతామని దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.