CBI: అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి దినం ఐదు మంది రైల్వే అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు తరలించారు. రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో పనిచేసే పై అధికారి ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆరుగురు సభ్యులు ఉన్న సీబీఐ బృందం చేసిన ఈ సోదాలలో భారీ మొత్తంలో నగదు, బంగారం గుర్తించినట్లు విశ్వనీయ సమాచారం.. మరోవైపు లంచం కేసులో గురువారం పట్టుకున్న సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ప్రతిప్ బాబును ఇతర ఉద్యోగులను డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం వారి ఇండ్లలో కూడా తనిఖీలు చేశారు. డివిజన్ పరిధిలో గతి శక్తి విభాగంలో పనిచేసిన కాంట్రాక్టు రమేష్ రెడ్డికి బిల్లు చెల్లింపునకు డబ్బు తీసుకుంటుండగా వీరిని పట్టుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంలో డీఆర్ఎం మీద కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: MLA KrishnaMohan Reddy: నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే..