ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలం…
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు కారుతో ఈడ్చుకళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారు బానెట్‌కు వేలాడుతూ ఉండడం, డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఎందుకో కారు ఆపాలని కోరారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బెజవాడలో మందుబాబులు హల్చల్ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. బహరగోరాలో జరిగే బహిరంగ ర్యాలీకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో కూరుకుపోయింది. ఓ వైపున కుండపోత వర్షం.. మరో వైపు వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.