ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు కారుతో ఈడ్చుకళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారు బానెట్‌కు వేలాడుతూ ఉండడం, డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఎందుకో కారు ఆపాలని కోరారు. అయితే, అతడు కారు ఆపకపోగా వారిని బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: B. C. Janardhan Reddy: గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను కోరారు. కానీ, అతడు కారు ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడని చెప్పారు. వీడియోలో ఏఎస్‌ఐ, ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్‌ను పట్టుకుని వేలాడుతుండగా, కారు డ్రైవర్ మాత్రం ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు.. చాలా దూరం వరకు అలాగే వారిని ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులిద్దరినీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారి పేర్లు ఏఎస్ఐ ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేష్ చౌహాన్. బెర్ సరాయ్ మార్కెట్ దగ్గర ట్రాఫిక్ చలాన్ జారీ చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గాయపడిన ఇద్దరు పోలీసుల వాంగ్మూలాలను తీసుకున్నారు. వాటి ఆధారంగా.. వసంత్‌కుంజ్‌లో నివసించే కారు యజమాని జై భగవాన్ పేరు మీద ప్రభుత్వ పనిని అడ్డుకోవడం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
READ MORE:Rohit Sharma: భారత్ ఘోర పరాజయం.. స్పందించిన కెప్టెన్ రోహిత్
दिल्ली की कानून व्यवस्था का ये Video देखिए –
कार ड्राइवर ने ट्रैफिक पुलिस के 2 जवानों को बोनट पर लटका लिया और कार दौड़ा दी। एक जवान सड़क पर गिर गया। फिर दूसरे को साइड मारकर आरोपी भाग निकला। Video वसंत कुंज इलाके में रेड लाइट की है। pic.twitter.com/S3uNSwhaRW
— Sachin Gupta (@SachinGuptaUP) November 3, 2024