కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. బహరగోరాలో జరిగే బహిరంగ ర్యాలీకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో కూరుకుపోయింది. ఓ వైపున కుండపోత వర్షం.. మరో వైపు వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.
ఓ మహిళ బైక్ పై ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో.. యువతి ఎలివేటెడ్ రోడ్డుపై నుంచి కిందపడి ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చాలా మంది వ్యక్తులు పిల్లర్ పై చిక్కుక్కున్న యువతిని రక్షించడానికి ప్రయత్నించినట్లు ఉంది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. కారు కడప నుండి రాయచోటికి వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొట్టింది.
దేశంలో ఏదొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కామాంధుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
కారులో ఎన్నో రకాలైన ముఖ్యమైన పరికరాలు ఉంటాయి.. అవి కారుకు చాలా ముఖ్యం. వాటితో పాటు.. కారుకు ముఖ్యమై దానిలో బ్రేకింగ్ సిస్టమ్ ఒకటి. బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా లేకుంటే సురక్షితమైన ప్రయాణాన్ని చేయలేము. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అన్ని కార్లలో బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
పారిస్ ఒలింపిక్ విజేత అర్షద్ నదీమ్‌పై పాకిస్థాన్‌లో ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురుస్తోంది. జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. దేశానికి స్వర్ణాన్ని సంపాదించిన క్రీడాకారుడిగా అర్షద్ రికార్డ్ సృష్టించాడు.