హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలు…
విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్ కాకవడంతో అందులో చిక్కుకున్నారు.. ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడకపోవడంతో.. విలవిలలాడి కన్నుమూశారు..
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ…
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. Also Read:US: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను.. ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు..…
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బొలెరో, కార్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని కొడంగల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తండ్రి కూతురు మృతి చెందారు. కార్…
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరు చిన్నారులను విధి వెంటాడింది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన…
నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.…
శ్రీశైలం సమీపంలో మరో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. శ్రీశైలం సమీపంలోని శిఖరం నుండి ఇష్టకామేశ్వరి గేటుకు వెళ్లే మార్గం మధ్య దారిలో నల్లమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి భక్తులకు చెందిన ఓ ఎలక్ట్రికల్ వాహనం చెట్లకు ఢీ కొట్టింది..
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. "పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం.