ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కేవలం తమిళనాడుకు చెందిన అభ్యర్థులనే బీజేపీ వెల్లడించింది.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఢిల్లీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని బృందం ఏపీకి వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ బృందంలో ఒడిశా ఎంపీ జై జయంత్ పాండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో బీజేపీ అగ్ర నేతలు శివ ప్రకాష్, మధుకర్ కూడా…
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి.