దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
సినీ నటి జయా బచ్చన్‌కు (Jaya Bachchan) మరోసారి రాజ్యసభ సీటు దక్కింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఆమె పేరును ప్రకటించింది. జయా బచ్చన్ (75 )తో పాటు మరో ఇద్దరి పేర్లను ఎస్పీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 అభ్యర్థులకు ఊరట అందించే వార్త ఒకటి చెప్పింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించింది. ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు తెలిపారు. గ్రూప్- 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో.. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు…
నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రేపటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఆన్ లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది
విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి..
Telangana Elections 2023: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల టెలీ ప్రచారం కూడా జోరందుకుంది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ తరహా ప్రచారం తగ్గినా ఈసారి మళ్లీ ఊపందుకుంది.