తెలంగాణలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో భారీ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారికి కేటాయించే గుర్తులపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది.
బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించారు. 43 మందితో బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం లో ఎప్పటి నుంచో ఖాళీ గా టీచర్ల పోస్టుల భర్తీ కి ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని 33 జిల్లాల్లో 5,089 టీచర్ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీకి విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేశారు.డీఎస్సీ ద్వారా పరీక్షలను నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానం లో జరపనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం…
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని వెల్లడించింది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో 52 మంది కొత్త వారిని టిక్కెట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. బిజెపి ఇతర పార్టీలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూనే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
Off The Record: అనారోగ్యంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా.. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది చివర్లో షెడ్యులు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సాంకేతికంగా కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ రిజర్డ్వ్ అయిన ఈ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి.…