Congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. కమల్‌నాథ్‌కు ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఈసారి మాత్రం రెండు రాష్ట్రాల ప్రస్తావన లేదు.
ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన చింద్వారా నుంచి ఆయన కుమారుడు నకుల్‌నాథ్ పేరును ప్రకటించారు. కమల్‌నాథ్ కుమారుడికి వేరే స్థానం ప్రకటిస్తారని తొలుత వార్తలు వినిపించాయి. దీంతో సోమవారం కమల్‌నాథ్ ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కమల్‌నాథ్ కుమారుడికి సీటు ప్రకటించడంతో వదంతులకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా.. సెకండ్ లిస్టులో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
అసోంలోని జోర్హాట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పోటీ చేయనున్నారు. నకుల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి పోటీ చేయనున్నారు. రాహుల్ కస్వా రాజస్థాన్‌లోని చురు నుంచి, వైభవ్ గెహ్లాట్ రాజస్థాన్‌లోని జలోర్ నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని భింద్ నుంచి ఫూల్‌సింగ్ బరయ్య పోటీ చేయనున్నారు.
ఇక బీజేపీ సెకండ్ లిస్టు కూడా ఈ రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది. రెండో జాబితాలో 100 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్సుంది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
#WATCH | Delhi: Congress General Secretary KC Venugopal says "We have already announced our first list of candidates for the Lok Sabha elections. Today, we are going to announce the second list. Yesterday, CEC met and cleared the list of around 43 names from Assam, Madhya… pic.twitter.com/ODKwCE1seF
— ANI (@ANI) March 12, 2024


Congress releases the second list of candidates for the upcoming Lok Sabha elections.
Congress MP Gaurav Gogoi to contest from Jorhat, Assam. Nakul Nath to contest from Madhya Pradesh's Chhindwara. Rahul Kaswa to contest from Rajasthan's Churu and Vaibhav Gehlot to contest from… pic.twitter.com/oms2aliTqF
— ANI (@ANI) March 12, 2024
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!