Trump - Trudeau: వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలర్ట్ అయ్యారు.
Justin Trudeau: హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.
Canada: కెనడాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య జరిగింది. శుక్రవారం ఎడ్మింటన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని ఒక ముఠా కాల్చి చంపింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని హర్షన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
Donald trump: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్‌లో "51వ రాష్ట్రం"గా చేయడంపై జోక్ చేశారు.
కంగనా రనౌత్ నటించిన బాలివుడ్ ‘క్వీన్’ సినిమాను చూశారా? ఈ సినిమాకు సంబంధించి కంగనాకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రాణి (కంగనా) కాబోయే భర్త విజయ్ (రాజ్‌కుమార్ రావు)కి కొన్ని గంటల ముందు పెళ్లి జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత.. రాణి దుఃఖంలో మునిగిపోకుండా.. ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. ఇది సినిమా స్టోరీ మాత్రమే.. అయితే ఇలాంటి రియల్ స్టోరీ కెనడలో…
India-Canada: కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో.. టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది.
Canada: కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. తన డిపార్ట్మెంట్ భారత్‌కి ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు.
గ్యాంగ్‌స్టర్, ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా కెనడాలో అరెస్టయ్యాడు. కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం, అంటారియోలో కాల్పుల ఘటనకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అయితే దాలా అరెస్ట్‌తో కెనడాలోని ట్రూడో ప్రభుత్వానికి ఖలిస్తాన్‌పై ప్రేమ కూడా కనిపిస్తోంది.