Solidarity Rally In Canada: హిందూ దేవాలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం సంఘీభావ ర్యాలీని చేపట్టారు. ఈ సమయంలో, ప్రజలు ఇకపై ఖలిస్తానీలకు మద్దతు ఇవ్వవద్దని కెనడియన్ రాజకీయ నాయకులు చట్ట అమలు సంస్థలపై ఒత్తిడి తెచ్చారు. ఆలయంపై ఆదివారం ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X…
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు.
ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది.
Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో గల ఆలయం వెలుపల హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వేగంగా స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని ట్రూడో.
India- Canada Row: భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్టావా ఇండియన్ కాన్సులర్ సిబ్బందిపై నిఘా పెట్టిందని భాతర ప్రభుత్వం ఆరోపించింది.
India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది.
Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పని చేసిన సీనియర్ దౌత్యాధికారి సంజయ్ వర్మ ఆరోపణలు చేశారు.
Khalistani Terrorist: భారత్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లు తమ(సిక్కుల) హక్కుల హననానికి పాల్పడ్డరారని పన్నూన్ ఆరోపణలు చేశాడు.
Sanjay Kumar Verma: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత సంబంధాల్లో తీవ్రమైన దౌత్యవివాదానికి కారణమైంది. అయితే, ఈ హత్యలో భారత సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందని సాక్ష్యాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలతో భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. మన దౌత్యవేత్తలు ఆరుగురిని రీకాల్ చేసింది. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.