Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్‌కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..
- కెనడాపై ట్రంప్ అదనపు పన్నులు విధిస్తే, ప్రతి చర్యలకు దిగుతాం..
- మన వస్తువులపై సుంకాలు విధిస్తే, అమెరికాలో రేట్లు పెరుగుతాయని ప్రజలకు తెలుసు..
- అమెరికా చర్యల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది: జస్టిన్ ట్రూడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం కష్టమైనదన్నారు. అయితే, ప్రజల జీవితాలను సరళతరం చేస్తానన్న చెప్పి అధికారంలోకి వచ్చారు ట్రంప్.. కానీ, ఇప్పుడు వారికి అసలు విషయాలు బోధపడుతున్నాయి. కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై పన్నులూ విధించడం వల్ల జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని యూఎస్ ప్రజలకు అర్థమవుతోందని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు.
Read Also: PM Modi-Adani Bag: ప్రియాంక గాంధీ బ్యాగ్‌పై మోడీ-అదానీ ఫోటోలు.. అభినందించిన రాహుల్
Also Read
ఇక, ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. నేను వాణిజ్య భాగస్వాములపై విధించే పన్నులతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరగడం లేదనే హామీ ఇవ్వడం లేదు.. కానీ, ఏ రకంగానూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోం కదా.. 25 శాతం సుంకాలనేవి కెనడా ఆర్థిక వ్యవస్థను బాగా నాశనం చేయనుంది. యూఎస్ మన నుంచి 65 శాతం చమురు, చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యుత్తు, దాదాపు మొత్తం సహజ వాయువును దిగుమతి చేసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే, అమెరికా అల్యూమినియం, వ్యవసాయోత్పత్తులకు కూడా మనపైనే ఆధారపడిందన్నారు. మనపై టారిఫ్‌లు విధిస్తే వీటి ధరలు భారీగా పెరుగుతాయి.. గత 8 ఏళ్ల క్రితమే ఇలాంటిది ఎదుర్కొన్నాం.. ఇప్పుడూ ఎదుర్కొంటామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!