Canada: కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. తన డిపార్ట్‌మెంట్ భారత్‌కి ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు.
గ్యాంగ్‌స్టర్, ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా కెనడాలో అరెస్టయ్యాడు. కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం, అంటారియోలో కాల్పుల ఘటనకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. అయితే దాలా అరెస్ట్‌తో కెనడాలోని ట్రూడో ప్రభుత్వానికి ఖలిస్తాన్‌పై ప్రేమ కూడా కనిపిస్తోంది.
Canada- India Row: భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో బయట జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి అర్ష్ దల్లాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి హర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడు. భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడికి వ్యతిరేకంగా సిక్కు కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, వివిధ హిందూ సంస్థల నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాణక్యపురిలోని డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని కెనడా హైకమిషన్ ముందు భద్రతను పెంచారు.
Canada Student Visa: కెనడా వెళ్లి చదువుకోవాలనుకోవడం భారతీయ విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. ఇన్నాళ్లు ఆ దేశ ప్రభుత్వం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీమ్‌ని నిలిపేసింది. కెనడా ప్రస్తుతం హౌసింగ్ సంక్షోభంతో పాటు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇబ్బడిముబ్బడిగా ఆ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని అక్కడి…
Justin Trudeau: ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ వస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్యూడో కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి, బండి చోర్ దివాస్‌ని పురస్కరించుకుని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిన్ ట్రూడ్ ఈ వ్యాఖ్యల్ని చేశాడు. ‘‘కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించడం లేదు’’ అని చెప్పాడు. ఇలా కెనడా ప్రధాని పేర్కొనడం ఇదే తొలిసారి.
Elon Musk: కెనడాలో పార్లమెంటరీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ఆస్ట్రేలియా టుడేపై కెనడా ఆంక్షలు విధించింది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు చేయకుండా బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ ఇటీవల అక్కడి హిందూ ఆలయంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.