హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే mlc గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఈనెల 30న జరుగనున్న బద్వేల్ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బద్వేల్ అభివృద్ధి జరగలేదన్నారు కేంద్ర మంత్రి మురుగన్. అభివృద్ధి ప్రభుత్వం కావాలో.. లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురగన్ కడప…
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు,…
గత మూడు నెలలుగా హుజూరాబాద్‌లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్‌గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్‌కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన…
హుజురాబాద్‌లో కుల సంఘాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందా? వారు ఏం అడిగితే దానికి ఓకే చెప్పేస్తున్నారా? హామీల వర్షం కురుస్తోందా? ఈ విషయంలో అధికారపార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చేంటి? ఒక్కోరోజు నలుగురు లేదా ఐదుగురు మంత్రుల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక తేదీ ప్రకటన ఇప్పట్లో లేకపోయినా.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడానికి పార్టీలకు బోల్డంత సమయం చిక్కింది. ఈ టైమ్‌ను అధికారపార్టీ టీఆర్‌ఎస్ చక్కగా ఉపయోగించుకుంటోందట. హుజురాబాద్ ఉపఎన్నిక తమకు పెద్ద విషయమే కాదని స్టేట్‌మెంట్లు…