ఈనెల 30న జరుగనున్న బద్వేల్ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బద్వేల్ అభివృద్ధి జరగలేదన్నారు కేంద్ర మంత్రి మురుగన్. అభివృద్ధి ప్రభుత్వం కావాలో.. లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురగన్ కడప జిల్లాలో పర్యటించారు. తిరుపతి నుంచి నేరుగా బద్వేల్ కు చేరుకున్న మంత్రి పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన వాహనంపై ఎక్కి రోడ్డు షోలో పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకూ బీజేపీ రోడ్ షో సాగింది. కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మురగన్ పాల్గొన్నారు. బద్వేల్ లో గత 40 ఏళ్లుగా వైయస్ ఫ్యామిలీనే పాలకులుగా ఉన్నారన్నారు. అయినా ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు.
వైయస్సార్ సీఎం గా పని చేశారని తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నా బద్వేల్ లో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయకపోయారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు. అభివృద్ది ప్రభుత్వం కావాలో లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే వస్తారని కానీ బీజేపీ అభ్యర్తి గెలిస్తే మోడీ సహకారంతో బద్వేల్ ను అభివృద్ది చేస్తారన్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం అక్కడి నుంచి పోరుమామిళ్లకు చేరుకున్న మంత్రి అక్కడ ఏర్పాటు చేసి రోడ్ షో లో పాల్గొన్నారు. ఒక వైపు జోరు వర్షం కరుస్తున్నా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ షో లో పాల్గొన్నారు. అక్కడి నుంచి పర్యటన ముగించుకుని మురుగన్ కడపకు వెళ్లారు.