ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా కలిసిరావు. ముఖ్యంగా రాజకీయాలకు ఇది అసలు సూట్ కాదు. కొన్నిసార్లు తాత్కాలికంగా పని చేసినట్లు కన్పించినా దాని ప్రభావం దీర్ఘకాలంలో ఉంటుందని రుజువైన సంఘటనలు అనేకం ఉన్నాయి. మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ పార్టీకి ఒక్క విషయంలో మాత్రం ఆనందం లేకుండా పోయింది. అది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పరాజయం…
కాంగ్రెస్ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్ పాలిటిక్స్. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటేనే అది. ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్.…
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్‌పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌కు ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్దం అవుతుంది టీఆర్ఎస్. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తెరాస నేతల సమావేశం అయ్యారు. నియోజక వర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల నియామకం పై చర్చించారు. సమావేశానికి ఇంచార్జీ లు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ , అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ బాబు, ఎమ్మెల్సీ లు పల్లా , బస్వరాజు సారయ్య, నార దాసు హాజరయ్యారు. ఈ నెల 10న…
రేపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది. నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున సాగర్ నియోజక మొత్తం ఓటర్లు 2,20,206 మొత్తం పాలైన ఓట్లు 1,89,782. సాగర్ ఉపఎన్నికలో మొత్తం 86.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో 1400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. సాగర్ ఉపఎన్నికలో 41 మంది అబ్యర్థులు పోటీలో ఉన్నారు.…