Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్ ది సెల్ఫ్’ సెల్ థెరపీ ట్రీట్మెంట్కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
Three Wheels Electric Car: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. అయితే ఈ కారుకు మూడు చక్రాలు మాత్రమే ఉండనున్నాయి. స్ట్రోమ్ 3 పేరుతో విడులవుతున్న ఈ కారు ధర కూడా తక్కువే ఉంటుందని తెలుస్తోంది. డైమండ్ కట్ ఆకారంతో కొత్త డిజైన్‌తో విడుదల కానున్న ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కారులో ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. అంతేకాకుండా…
IT Returns Refund: ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా.. రెండు నెలలు దాటినా ఇంకా మీకు ఐటీఆర్ రీఫండ్ కాలేదా.. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ఐటీఆర్ రీఫండ్ కాకపోవచ్చు. ఆ కారణాలేంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఐటీఆర్ రీఫండ్‌కు మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం ఐటీఆర్‌ను ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. ఒకవేళ రీఫండ్‌కు మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే…
Local Languages in Public Sector Banks: బ్యాంక్ ఉద్యోగులు స్థానిక భాషలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. లోకల్ లాంగ్వేజ్‌ల్లో మాట్లాడలేని సిబ్బందిని కస్టమర్ ఫేసింగ్ జాబుల్లో కూర్చోబెట్టొద్దని సూచించారు. సౌతిండియాలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు ప్రజలను హిందీలో మాట్లాడాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
Reserve Bank Of India: నిత్యావసర ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యులపై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకుంటుందని తెలుస్తోంది. ఈనెల 30న ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేట్లను ఆర్బీఐ పెంచనుంది. ఇప్పటికే గత రెండు సమీక్షల్లో వరుసగా వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచింది. ఇదే జరిగితే…
Hyderabad Tops India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. దేశంలోని టాప్-8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో కావటం విశేషం. షామింగ్ మాల్స్‌లో లీజుకి ఇచ్చే విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్ఏ)ను ప్రతిపదికగా తీసుకొని ఒక జాబితా రూపొందించారు. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్ఏ కలిగిన షాపింగ్ మాల్స్, అవి ఉన్న నగరాలను గ్రేడ్-ఎలో చేర్చారు.
Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి.…