Buy Now Pay Later: ఫిన్ టెక్ యూనికార్న్ పైన్ ల్యాబ్స్ అందిస్తున్న బుక్ నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) సర్వీసుకి చిన్న పట్టణాల్లో భారీ డిమాండ్ నెలకొంటోంది. ఈ లావాదేవీల విలువ ఈ నెలలో 5 వేల కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా వేస్తోంది. పండగ సీజన్ నేపథ్యంలో ప్రొడక్టులను ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) పద్ధతిలో (ఆఫ్‌లైన్ మర్చెంట్ కమ్యూనిటీలో) కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పైన్ ల్యాబ్స్ టయర్-2, టయర్-3 సిటీల్లో విస్తరణకు ప్రయత్నిస్తోంది.
Chiranjeevi vs Balayya: 25వ సారి చిరంజీవి, బాలయ్య ఢీ!
వినియోగదారులు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్, పెద్ద ఉపకరణాలు (లార్జ్ అప్లయెన్సెస్), స్మార్ట్ టెలివిజన్స్, వాషింగ్ మెషీన్స్ తదితర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఫ్యాషన్, దుస్తులు, లైఫ్ స్టైల్ ప్రొడక్టుల పర్చేజ్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అక్టోబర్ మొత్తమ్మీద నమోదుకానున్న ట్రాన్సాక్షన్ల సంఖ్య రూ.5 వేల కోట్లకు చేరుతుందని పైన్ ల్యాబ్స్ ఆశిస్తోంది. ఇది ఒక యావరేజ్ మంత్(ఒక సగటు నెల)తో పోల్చితే వంద శాతం గ్రోత్ అని బీఎన్‌పీఎల్ బిజినెస్ లీడర్ మయూర్ ములానీ తెలిపారు. గత రెండేళ్లలో ప్రజలు ఫెస్టివ్ సీజన్‌లో షాపింగ్ కోసం స్టోర్లకు వస్తుండటం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు.
ఓవరాల్‌గా చూస్తే పైన్ ల్యాబ్స్ విలువ 5.05 బిలియన్ డాలర్లు. ఈ సంస్థ రాజోర్‌పే, పేటీఎం, పేయూ వంటివాటితో పోటీ పడుతోంది. ఈ నెలలో బీఎన్‌పీఎల్ సర్వీస్ అందించటం కోసం, భాగస్వామ్యం కుదుర్చుకోవటం కోసం లక్ష స్టోర్లతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికే శామ్‌సంగ్, సోనీ, వర్ల్‌పూల్, జియోమీ, ఒప్పో కంపెనీలతో పార్ట్నర్‌షిప్ కలిగి ఉంది. ‘‘రూ.10 వేలు, రూ.20 వేల ఖరీదైన వస్తువులు కొన్నవారికి కూడా బీఎన్‌పీఎల్ సౌకర్యం కల్పించటం తమకు బాగా కలిసి వచ్చిందని ములానీ అభిప్రాయపడ్డారు.