Samsung India: ‘శామ్‌సంగ్ ఇండియా’ ఖుషీ ఖుషీ. గత ఐదేళ్లలో ఎప్పుడూలేనంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్‌సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్ 4.86 శాతం తగ్గింది. సుమారు రూ.4,041 కోట్ల నుంచి రూ.3,844 కోట్లకు పరిమితమైంది.
Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
Also Read
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
మొబైల్ హ్యాండ్‌సెట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఉత్పత్తులను తయారుచేసే శామ్‌సంగ్ ఇండియాకి సంబంధించిన ఈ విషయాలను టోఫ్లర్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 2020-21లో శామ్‌సంగ్ ఇండియా మొత్తం ఆదాయం రూ.77,501.40 కోట్లు కాగా 2021-22లో 10.09 శాతం పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి. రూ.71,899 కోట్ల నుంచి 10.93 శాతం అధికమై రూ.79,758.90 కోట్లకు చేరుకున్నాయి.
శామ్‌సంగ్ 1995లో ఇండియాలోకి ప్రవేశించింది. న్యూఢిల్లీకి దగ్గరలోని నోయిడాతోపాటు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రెండు ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసింది. ఐదు ఆర్ అండ్ డీ సెంటర్లు, ఒక డిజైన్ సెంటర్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. 2 లక్షలకు పైగా ఉన్న రిటైల్ ఔట్‌లెట్లు, 3 వేలకు పైగా ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్లు వీటికి అదనం.
తాజావార్తలు
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!