GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మే నెలలో 1.5 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది. మే నెలలో వసూలైన మొత్తం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో సీజీఎస్‌టీ రూ. 28,411 కోట్లు కాగా, ఎస్‌జీఎస్‌టీ రూ. 35,828 కోట్లు. ఐజీఎస్‌టీ రూ. 81,363 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,772 కోట్లతో కలిపి). అలాగే సెస్ రూ. 11,489 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా వచ్చిన రూ. 1,057 కోట్లతో కలిపి).
2023 నెలలో వచ్చిన ఆదాయాలు గతేడాది ఇదే నెలలోని జీఎస్‌టీ రాబడి కంటే 12 శాతం ఎక్కువ. ఈ నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 12 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 11 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.35,369 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.29,769 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత మే 2023లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.63,780 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.65,597 కోట్లుగా ఉంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also:Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..
కాగా గత నెల అంటే 2023 ఏఫ్రిల్ లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.1,87,035 కోట్లకు చేరుకున్నాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.75 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కాడవం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో మాత్రమే వసూళ్లు కాస్త తగ్గాయి. ఆ తర్వతా నుంచి మళ్లీ పుంజుకుని ప్రతి నెల కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కాగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి క్యూ 4 లో 6.1 శాతంగా నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. గత అంచనాలను మించి భారత వృద్ధి వృద్ధి నమోదు చేయడం మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇదే తరహా ఫలితాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా జీడీపీ వృద్ధి అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు.
Read Also:Mahendra singh dhoni: కప్ గెలిచిన రెండ్రోజులకే ఆస్పత్రిలో చేరిన ధోనీ
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..