Ffreedom App: విద్య, జీవనోపాధి అవకాశాల కోసం ఒక సమగ్ర వేదిక ఫ్రీడమ్ యాప్ ధరల నమూనాలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న కోర్సుల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చేయడానికి, ప్రతి-కోర్సుకు విడిగా చెల్లించే ధరల నమూనాను ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్ యాప్ రెండు ముఖ్యమైన ధ్యేయాలున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని ప్రసాదించి అవకాశాలను అందించడం, కమ్యూనిటీల ద్వారా నడుపబడే వాణిజ్యం/కామర్స్ ద్వారా జీవనోపాధి అవకాశాలను అందించడమే తమ లక్ష్యాలని తెలిపింది.
గతంలో ఫ్రీడమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ప్రైసింగ్ మోడల్ వినియోగదారులకు, ప్లాట్‌ఫారంలోని అన్ని కోర్సులకు 3 నెలలు, 12 నెలలు లేదా 36 నెలల పాటు యాక్సెస్‌ను అందించింది. ఇందుకు ధరలు రూ. 4999, రూ. 9999, రూ.14999గా ఉండేవి. ఈ ధరలు కొనుగోలు చేయగల వినియోగదారులకు గొప్ప జ్ఞానాన్ని అందించినప్పటికీ.. అధిక ఖర్చుల కారణంగా చాలా మంది అభ్యాసకులు కోర్సులను పొందాలని ఉన్నప్పటికీ, దూరంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఈ నూతన విధానంలో, ప్రతి కోర్సుకు విడిగా చెల్లించే పద్ధతి ద్వారా, వినియోగదారులకు మరింత సరసమైన ధరతో వ్యక్తిగత కోర్సులను కొనుగోలు చేయడానికి వీలు అవుతుంది. తద్వారా, ఈ సమస్యను పరిష్కారం లభిస్తుంది. వినియోగదారులు, ఇకపై వ్యక్తిగత కోర్సులను రూ. 499, రూ. 599, రూ. 999, కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన కంటెంట్‌కు జీవితకాల (లైఫ్-టైం) యాక్సెస్ లభిస్తుంది. ఈ విధానంతో, పరిమిత వనరులు ఉన్నవారు, వారి పెట్టుబడి, సమయాన్ని, వారికి సరిపోయే విద్య, జీవనోపాధి అవకాశాలపై పెట్టవచ్చు అనడంలో సందేహం లేదు.
Read Also: Delhi : ఢిల్లీ బడ్జెట్ కు కేంద్రం బ్రేక్.. ఉద్యోగులకు జీతాలివ్వలేం: కేజ్రీవాల్
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ధరల నమూనా ఆల్-యాక్సెస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌కు కట్టుబడే ఉంది. అయినప్పటికీ ప్రతి కోర్సుకు విడిగా చెల్లించే ధరల నమూనా పద్దతిని ప్రవేశపెట్టడం, వినియోగదారుల జీవితాలను అర్ధవంతంగా మార్చాలనే ధ్యేయం కోసం పని చేస్తున్న కంపెనీ నిబద్ధతను తెలుపుతుంది. ఆర్థికంగా వెనుకబడిన అభ్యాసకులకు, వారి విద్యలో పెట్టుబడి పెట్టడానికి, కమ్యూనిటీ ద్వారా నడిచే కామర్స్ అవకాశాలను యాక్సెస్ చేయడానికి అవకాశాన్ని అందించడం ద్వారా, పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేసి వారిని శక్తివంతం చేయాలని ఫ్రీడమ్ యాప్ భావిస్తోంది.
“వినియోగదారుల కోసం కొత్త పే-పర్ కోర్సు ఎంపికను ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. నాణ్యమైన జీవనోపాధి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ కొత్త ఫీచర్, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మరో అడుగు. రూ. 399 నుండి ప్రారంభమయ్యే ధరలు, మా వినియోగదారులు ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అధిక ధరల గురించి చింతించకుండా మా కోర్సులను యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ మా వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అందించడంతో పాటు వారి జీవిత లక్ష్యాలను సాధించడంలో వారికి సహాయపడుతుంది. ఈ నూతన విధానం, మా కమ్యూనిటీని ఎలా ప్రభావితం చేస్తుందో చూడడానికి మేము ఎదురు చూస్తున్నాము. అలాగే, మెరుగైన సమాజం కొరకు, మా ప్లాట్‌ఫారంలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టడం, మెరుగుపరచడం వంటి మార్పులు కొనసాగిస్తూనే ఉంటాము.” అని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ వ్యవస్థాపకులు, సీఈవో సీఎస్ సుధీర్ అన్నారు.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ గురించి: ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అన్ని వర్గాల వ్యక్తులకు నాణ్యమైన విద్య, కమ్యూనిటీ యాక్సెస్, కమ్యూనిటీ-నేతృత్వంలోని వాణిజ్య అవకాశాలను అందించే ఒక వినూత్న జీవనోపాధి వేదిక. విద్య, జీవనోపాధి అవకాశాలను పొందడం ద్వారా మాత్రమే పేదరికాన్ని అంతం చేయవచ్చు అనే నమ్మకంతో, స్థాపించబడిన సంస్థ ఫ్రీడమ్ యాప్. మా వినియోగదారులను, వారి జీవితాలను మెరుగుపరచడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి కావలిసిన జ్ఞానం, నైపుణ్యాలు, మద్దతు అందించి వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.