విజయవాడ వర్షాల కారణంగా మళ్లీ బుడమేరు పొంగుతుంది.. అని సోషల్ మీడియా పోస్టులతో కొంతమంది హల్చల్ చేస్తున్నారు.. దీంతో, వర్షాలు పెరిగితే మళ్లీ బుడమేరు కట్ట తెగి.. మళ్లీ వరదలు వస్తాయి అని విజయవాడ వైస్సార్ కాలనీ వాసులు భయపడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగోతన్న ఈ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు పోలీసులు..
విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
YSRCP: వరద బాధితులకు 50వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 33 కార్పొరేషన్ లో ముంపుకు గురయ్యారని., బుడమేరు వరద ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని.. మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పెద్ద అవస్థలు వర్ణనాతీమని., మా పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..…
Minister Dola: బుడమేరు మళ్లీ కొట్టుకు పోతుందని సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలో వరద బాదితుల పరిస్దితులు మెరుగయ్యాయి.. ఓ ముఖ్యమంత్రిగా బాధితుల కోసం నాలుగు గంటలు జేసీబీ మీద ప్రయాణించిన చిత్తశుద్ది మా సీఎందే.. వైసీపీ అధినేత ఎక్కడికైనా వెళ్లి బాదితులకు సహాయం చేశారాని ఆయన పేర్కొన్నారు.
బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీసు అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సీఐ శివప్రసాద్ రక్షించారు.
ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు.
కృష్ణా జిల్లా బుడమేరులో ఓ కారు కొట్టుకుపోయింది.. కేసరపల్లి ఉప్పులూరు రహదారిలో బుడమేరు కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి.. కారుతో సహా కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు..
బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి.