CPI Narayana: విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. రోడ్లు, మంచినీళ్లు, డ్రైనేజీ సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్తులు.. కాంటూరు పరిధి తగ్గించి తమకు జీవనాధారం కల్పించాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు.. కొల్లేరు పూడిక తీయించి నీటి పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని నారాయణ దృష్టికి తీసుకు వచ్చారు గ్రామస్తులు.. పూడిక తీయకపోవడం వల్ల వరదల సమయంలో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు
ఇక, ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రాయలసీమలో ఎక్కడా నీళ్లు దొరకవు, మహిళలు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు.. లంక గ్రామాల చుట్టూ నీళ్లు ఉన్నా తాగడానికి చుక్క నీళ్లు లేవు , అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా లంక గ్రామాల పరిస్థితి ఉందన్నారు.. ఆసియాలోనే అతిపెద్ద సరస్సు కొల్లేరు చేపలు పెంచుకోవచ్చు.. ఎలాంటి మందులు వాడకూడదన్నారు.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అప్పట్లో కొల్లేరు చెరువులు కొట్టేశారు.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.. నాయకులు ప్రజల బాగు కోసం కాకుండా ఓట్ల కోసం కాంటూరు పరిధి గురించి మాట్లాడారని దుయ్యబట్టారు.. అయితే, విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు అన్నారు. వర్షాలు, నీళ్ళు లేకపోతే బతుకే లేదు.. నీటి ప్రవాహానికి మనం అడ్డుకట్ట వేయకూడదు.. వాటి ప్రవాహాన్ని ఆక్రమనలతో అడ్డుకుంటేనే వరదలు వస్తాయన్నారు.. ముఖ్యమంత్రి చెబితే వినే అవకాశం ఇప్పుడు కేంద్రంలో ఉంది.. బుడమేరు నుంచి కొల్లేరు వరకూ పూడిక తీయాలి, లంక గ్రామాలకు రోడ్లు వేయాలని సూచించారు..
Read Also: IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎర్ర చందనం నిత్యం అక్రమంగా తరలిపోతూనే ఉంటుంది, కానీ, అటవీ శాఖ అధికారులు ఒక లారీ పట్టుకుని.. పది లారీలు వదిలేస్తారు అని ఆరోపించారు నారాయణ.. ఇక్కడ లంక గ్రామాల్లో రోడ్లు వేయాలంటే.. అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు కాదంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.. కేంద్రంలో చంద్రబాబుకి ప్రస్తుతం అంత పట్టుంది.. కేంద్రంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేయొచ్చు, పూడికలు తీయడం, ఆక్రమణలు తొలగించడం చేయాలి.. కనీస సమస్యలు లంక గ్రామాల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాస్తాను.. కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసి చేయాల్సిన పనులు ఇవి.. మేం ఓట్ల కోసం కాదు… జనం కోసం ఉంటాం 2025 ఫిబ్రవరి ఒకటో తారీకు కల్లా రోడ్లు వెయ్యకపోతే పెనుమాక లంక వెళ్లే దారిలో పోరాటం చేస్తాం.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.