వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందచేస్తాం.. నష్టం అంచనాలపై నివేదిక రేపు పంపనున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏరియల్ సర్వే చేశాను.. కొల్లేరు సరస్సు, బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతం చూశాను.. బుడమేరు గండ్లు పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్తామని వెల్లడించారు.. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి…
Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ…
ఈ రోజు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకుని ముంపు ప్రభావంపై…
బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చే వరకు తాను అక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువకు మూడు ప్రాంతాలలో గండి పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు.
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
Budameru: కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదంటున్నారు అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చోచ్చుకు వచ్చాయి వరద నీరు. దాంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ…